Naga Manikanta: బిగ్ బాస్ కే షాకిచ్చిన నాగ మణికంఠ.. సెల్ఫ్ ఎలిమినేషన్ తో ట్విస్ట్!
on Oct 21, 2024
బిగ్ బాస్ సీజన్-8 నిన్నటితో ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ ఏడు వారాలు ఫుల్ కంటెంట్ ఇస్తూ అత్యధిక ఓటింగ్ తో దూసుకెళ్తున్న నాగ మణికంఠ(Naga Manikanta) నిన్న ఎలిమినేషన్ అయి బయటకొచ్చాడు.
సండే ఫన్ డే అంటు నాగార్జున నిన్నటి ఎపిసోడ్ లో వచ్చేశాడు. ఇక హౌస్ మేట్స్ తో ' చిత్రం భళారే విచిత్రం' అనే గేమ్ ఆడించాడు. ఇందులో బాయ్స్ అంతా ఓ వైపు, గర్ల్స్ అంతా మరోవైపు ఉంచి గేమ్ ఆడించగా బాయ్స్ గెలిచారు. ఇలా గేమ్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేవింగ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక ఒక్కొక్కరికి ఒక్కో సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్ తెప్పించాడు నాగార్జున. అందులో అన్న రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు అనే ట్యాగ్ నిఖిల్ కి గౌతమ్ ఇచ్చాడు. నవ్వు ఆపుకుంటున్నావ్ కదా రా చారి విష్ణుప్రియకి నయని పావని ఇచ్చింది. నువ్వు ఊరుకో అమ్మ అన్నింటికి తుత్తు తూ అంటావనే ట్యాగ్ ప్రేరణకి నిఖిల్ ఇచ్చాడు. అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానని ట్యాగ్ అవినాష్ కి టేస్టీ తేజ ఇచ్చాడు. వాడిని అలా వదిలేయకండిరా .. ఎవరికైన చూపించండ్రా మణికంఠకి హరితేజ ఇస్తుంది. సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అనే ట్యాగ్ ని విష్ణుప్రియకి రోహిణి ఇస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అంటు గంగవ్వకి ఇచ్చింది విష్ణుప్రియ. ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందామనే ట్యాగ్ గౌతమ్ కి నబీల్ ఇచ్చాడు నబీల్.
ఇక చివరగా మణికంఠ, గౌతమ్ ఉండగా.. నా వల్ల అవ్వడం లేదు సర్ నేను బయటకు వెళ్ళిపోతా అంటు మణికంఠ చెప్పగానే.. నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నింట్లో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావనే వచ్చింది. మీ ఫ్యామిలీ కోసం ఆలోచించు అని నాగార్జున చెప్పిన మణికంఠ బాబు వినలేదు. ఫిజికల్ గా ఆడలేకపోతున్నానంటు చెప్పుకొచ్చాడు. ఇక ఎలిమినేషన్ అయి స్టేజ్ మీదకి వచ్చాక తన జర్నీ వీడియో కూడా చూపించలేదు బిగ్ బాస్ మామ. ఎందుకంటే వాళ్ళు గౌతమ్ ఎలిమినేషన్ అని కన్ఫమ్ అయి అతడి జర్నీ వీడియో రెడీ చేసి ఉంటారు కానీ మణికంఠ వారికి షాకిస్తాడని ఊహించలేదు. అందుకే అతని జర్నీ వీడియో కూడా ప్లే చేయలేదు..
Also Read